తెలంగాణలో అడవులకు మహర్దశ : మంత్రులు హరీష్ ‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని అడవులకు మహార్దశ వచ్చిందని మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ సంగాపూర్‌లో  కల్పకవనం-అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును గురువారం వారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపద 4 శాతం పెరిగిందని, దీంతో ప్రపంచమంతా మొక్కల పెంపకం విషయంలో తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కోరుకునే పర్యాటకులకు అర్బన్‌పార్కులు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు. ఇప్పటికే 240 కోట్ల మొక్కలు నాటి, గ్రామగ్రామానికి నర్సరీలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.