రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన జన్మదినం సందర్భంగా కామారెడ్డిలో తన నివాసం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక మొక్కకు జీవం పోసే అవకాశాన్ని నా పుట్టిన రోజు సందర్భంగా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ స్ఫూర్తి తో ప్రతి ఒక్కరు ఏ మంచి సందర్భంలో నైనా మొక్కలు నాటాలని పిలుపును ఇచ్చారు. ఇలాంటి హరిత ఉద్యమం ద్వారా యావత్ భారత దేశం హరిత మయంగా మారాలి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కన్న కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.
