గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత.. డీఎస్పీకి గాయాలు

సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 540 సర్వేనంబర్‌లోని గిరిజన భూములను గ్లేడ్‌ ఆగ్రో కంపెనీ ఆక్రమించింది. దీనికి నిరసనగా  ఆందోళన నిర్వహించిన బీజేపీ నేతలు.. గ్లేడ్‌ ఆక్రమించిన భూముల్లో షెడ్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించి పోలీసులపై బీజేపీ నాయకులు దాడికి దిగారు. ఈ దాడిలో కోదాడ డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐతో పాటు పలువురు పోలీసులకు  తలపై తీవ్ర గాయాలయ్యాయి.