సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమ పోస్టర్ ను అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.
జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోటి వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణ భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి కోటి వృక్షార్చన కార్యక్రమం గురించి మంత్రికి వివరించారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ‘కోటి వృక్షార్చన’ లాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను ఈ సందర్భంగా అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు.