తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8.30 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్‌, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.

సుమారు 7 వేల కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. వెబ్‌ కాస్టింగ్ ద్వారా గిరిజా శంకర్‌‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం 6.30 ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా పాజిటివ్‌ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు.