టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌గా గోవర్ధన్‌

ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్టీయూ రెక్టార్‌ డాక్టర్‌ గోవర్ధన్‌ను, ఈ సెట్‌ కన్వీనర్‌గా డాక్టర్‌ చిట్టిరెడ్డి వెంకటరమణారెడ్డిని నియమిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. గోవర్ధన్‌ గతేడాది కూడా ఎంసెట్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. జేఎన్టీయూలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ అయిన వెంకటరమణారెడ్డి.. గతంలో అడ్మిషన్స్‌ డైరెక్టర్‌గా, వర్సిటీ ప్లేస్‌మెంట్స్‌ ఆఫీసర్‌గా, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా పనిచేశారు.