గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటరు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన జన్మదినాన్ని పురస్కరించుకొని బషీర్ బాగ్లోని ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ‘కోటి వృక్షార్చన’ ఒకే రోజు – ఒకే గంటలో- ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
