అరకు ప్రమాద ఘటనపై మంత్రి అవంతి దిగ్భ్రాంతి

అరకు ఘాట్‌ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం విషయం తెలియగానే విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. 

జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీవోతోనూ  మంత్రి  మాట్లాడారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ఉన్నట్లు సమాచారం.  అత్యవసర సహాయం కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్లను 0891 2590102, 0891 2590100 ఏర్పాటు చేశారు.