ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వచ్చే నెల 1న వార్షిక బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ సెషన్‌ను జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్న సీసీపీఏ.. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించాలని నిర్ణయించింది.