నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి : రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ జగత్‌కుమార్‌రెడ్డి

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని రూరల్‌ డెవలప్‌ మెంట్‌ రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ జగత్‌కుమార్‌ రెడ్డి సూచించారు. రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాల మేరకు మం డల పరిధిలోని పెద్ద కిష్టాపురం పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, నర్స రీ, ఉపాధి పనులను సోమవారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం పంచాయతీకి చేరుకొని చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పని చేస్తున్న సంబంధిత అధికారులతో పాటు సిబ్బంది మండల కేంద్రాల్లోనే నివాసాలు ఉండాలని, విధులకు సకాలంలో హాజరుకావాలని సూచించారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ విద్యాచందన, ఎంపీడీవో రవీందర్‌రావు, ఈజీఎస్‌ ఏపీవో సజన్‌ స్వరూప్‌, సర్పంచ్‌ గంగావత్‌ కుంతి నాయక్‌, కార్యదర్శి భూక్యా క్రాంతి కుమార్‌ నాయక్‌ ఉన్నారు.

బయ్యారం మండలంలో పెద్ద గుట్ట అటవీ ప్రాంతలోని ట్రంచ్‌ పనులు, బయ్యారం పల్లె ప్రకృతి వనం, నర్సరీలను ఉపాధి హామీ జాయింట్‌ కమిషనర్‌ జగత్‌ కుమార్‌ రెడ్డి సోమవారం పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల కేద్రంలోని పలు వీధుల్లో హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల సంరక్షణలో అలసత్వం వహిస్తే చర్య లు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీ విద్యా చందన, ఎంపీడీవో చలపతిరావు, ఎంపీవో మాధవి, సెక్రటరీ శరత్‌, టీఏలు శేఖర్‌, కిషన్‌, మంజుల ఉన్నారు.