మూసీ పరీవాహకాన్ని సుందరీకరిస్తాం: ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్ సుధీర్‌రెడ్డి

మూసీ నది నుంచి విషపూరిత జలాలను తొలగించి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతా మని, సీఎం కేసీఆర్‌ జన్మదినం రోజున మూసీ పక్కన మొక్క లు నాటే కార్యక్రమం నిర్వహిస్తామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆ ర్‌, మంత్రి కేటీఆర్‌ మూసీ నదికి మహర్దశ తేవాలన్న లక్ష్యం తో ఉన్నారని, ఆ క్రమంలో తన వంతుగా మూసీని సంపూర్ణంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నాగోలు బ్రిడ్జ్‌ నుంచి మూసీకి ఇరువైపులా సుమారు మూడున్నర కిలోమీటర్లు వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లను నిర్మిస్తున్నామన్నారు. 

వీటితో పాటు మూసీకి ఇరువైపులా పచ్చదనం నింపుతున్నామన్నారు. ఇప్పటికే పలు మొక్కలను, గార్డెనింగ్‌ను చేపట్టడం జరిగిందన్నారు. రాబో యే రోజుల్లో మూసీ ప్రాంతం ఆహ్లాదకరమైన ప్రాంతంగా మారనుందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మూసీ పరివాహంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, కాలనీవాసులు కూడా కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలన్నారు. రాబోయే రోజుల్లో మూసీ నదిని సుందరీకరించి బోటు షికారు ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దుతామన్నారు.