అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి  మంత్రి కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  మంత్రి అల్లోల ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో  చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేటీఆర్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.    

ఇంద్రకరణ్‌ రెడ్డి జన్మదిన వేడుక‌లను నిర్మల్‌లో  ఘ‌నంగా నిర్వహించారు.   మంగ‌ళ‌వారం  టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో ఆయన నివాసంలో మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సంద‌ర్భంగా  పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మంత్రి  అల్లోలకు శుభాకాంక్షలు తెలిపారు.