
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన పార్టీల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుని రెండు పార్టీల్లో అవగాహన లోపం రాకుండా అన్నీ సమస్యలపై చర్చించాం. బీజేపీ పెద్దలతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు పవన్‌కల్యాణ్ తెలిపారు. బీజేపీతో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నాం. బీజేపీ-జనసేన మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్‌కళ్యాణ్ ధీమావ్యక్తం చేశారు. బీజేపీ, జనసేన రూపంలో రాష్ట్రంలో మూడో ప్రత్నామ్నాయం రానుంది. మోదీ, అమిత్ షా నమ్మకాన్ని నిలబెడతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి నడుస్తామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.