తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఏఎస్పీలు జిల్లాలకు అటాచ్‌

తెలంగాణ రాష్ట్రంలో గ్రేహౌండ్స్‌ ఏఎస్పీలుగా ఉన్న 11 మంది 2017, 2018 బ్యాచ్‌ ఐపీఎస్‌లను తాత్కాలికంగా జిల్లాలకు అటాచ్‌ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన జిల్లాల్లో పోలీసింగ్‌ విధులు నిర్వహిస్తూనే, నక్సలిజం సంబంధిత కార్యకలాపాలపై దృష్టి సారించాలని అందులో పేర్కొన్నారు. అఖిల్‌ మహాజన్‌, నిఖిల్‌పంత్‌ను రామగుండం సీపీకి, కిరణ్‌ ప్రభాకర్‌ను నిర్మల్‌ ఎస్పీకి, చెన్నూరి రూపేశ్‌ను ములుగు ఎస్పీకి, యోగేశ్‌గౌతమ్‌ను మహబూబాబాద్‌ ఎస్పీకి, స్నేహామెహ్నాను ఖమ్మం సీపీకి, హర్షవర్ధన్‌ను ఆదిలాబాద్‌ ఎస్పీకి, గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ను వరంగల్‌ సీపీకి, రతిరాజ్‌ను కరీంనగర్‌ సీపీకి, బిరుదరాజు రోహిత్‌రాజ్‌ను కొత్తగూడెం ఎస్పీకి, బాలస్వామిని ఆసిఫాబాద్‌ ఎస్పీకి అటాచ్‌ చేశారు. అందరూ వెంటనే రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.