తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన ఆగమ సలహాదారు సుందర భట్టాచార్యులు మంగళవారం మృతిచెందారు. నెల్లూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పంచమి వేడుకలు, సామూహిక సరస్వతి పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే దవాఖానకు తరలించగా అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.
