తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు అటవీ, పర్యాటక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోటి వృక్షార్చనలో భాగంగా కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్‌లో మొక్కలు నాటి సెల్ఫీ దిగారు. అనంతరం మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పారు. పచ్చదనంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్‌గా కోటి వృక్షార్చాన లాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.
