నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజంలో మొక్కలు నాటిన సీఎస్‌ సోమేష్ కుమార్

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోటివృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి‌ సోమేష్ కుమార్ మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటలాలిటీ మేనేజ్‌మెంట్‌ (NITHM)లో సీఎస్‌ టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాస్‌తో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఎన్‌ఐటీహెచ్‌ఎం డైరెక్టర్ డాక్టర్‌ చిన్నంరెడ్డి, టూరిజం మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.