రుద్రాక్ష‌ మొక్క నాటిన సీఎం కేసిఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజ‌య‌వంత‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రార్ధన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా “కోటి వృక్షార్చన”లో పాల్గొని రుద్రాక్ష‌ మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు.