న్యాయవాద దంపతుల హత్యను ఖండించిన హైకోర్టు న్యాయవాదులు

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్యను హైకోర్టు న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. హత్యలను ఖండిస్తూ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. దంపతుల హత్య కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.