శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శనివారం ఉదయం 9 గంటలకు, గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు మార్చి నెల టికెట్ల కోటాను ఈనెల 22న ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం కౌంటర్లలో ఆఫ్‌లైన్ విధానంలో సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీ కొనసాగుతోంది.
