రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) డీ సతీశ్‌పై సస్పెన్షన్‌ వేటు.. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) డీ సతీశ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆర్‌ఐ సతీశ్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఇసుక ట్రాక్టర్లకు కూపన్లు జారీ చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఆర్ఐను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని, బాధ్యత మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.