నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. రాష్ట్ర ఎైక్సెజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు ముఖ్యనేతలు కూడా మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. ఆదివారం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లే అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు.