రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి‌ తెలిపారు. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఎంపిక చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తిరుమలలో శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రథ సప్తమి రోజు లక్ష మంది భక్తులకు వాహన సేవలు వీక్షించే భాగ్యం కల్పించామని పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. ఏప్రిల్ 14న ఉగాది నాటి నుంచి భక్తులను శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.