ఏపీలో కొత్తగా 118 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 118 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 667 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 889799కు చేరింది. 881963 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్‌-19తో మరణించిన వారి సంఖ్య 7169కు చేరింది.