కాయిర్‌ బోర్డు సభ్యుడిగా మిరుపాల గోపాల్‌రావు

తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్‌) సీనియర్‌ సంయుక్త కార్యదర్శి మిరుపాల గోపాల్‌రావును కాయిర్‌ బోర్డు (కొబ్బరి పీచుతో తయారయ్యే వివిధ ఉత్పత్తులకు సంబంధించిన) సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శనివారం గోపాలరావుకు నియామకపత్రాన్ని పంపారు.