ఏసీబీ వలలో పాఠశాల విద్యాశాఖ‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

లంచం తీసుకుంటూ పాఠశాల విద్యాశాఖ‌ సహాయ సంచాలకుడు శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు పాఠశాల అనుమతి పునరుద్ధరణకు శ్రీనివాస్‌ రూ. 40 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. లంచం డబ్బు తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్‌ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పాఠవాల విద్యా కమిషన్‌ కార్యాలయంలో అధికారులు సోదాలు చేపట్టారు.