స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్‌లో బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల నిరసన చేపట్టారు. కార్మిక సంఘాల నిరసనతో బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. బంద్‌లో వైఎస్‌ఆర్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.
