ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆదేశాలతో మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా

హరితహారంలో నాటిన మొక్క ధ్వంసానికి కారకులైన ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ గవర్నమెంట్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో మూడేండ్ల క్రితం సేవ్‌ ద ట్రీస్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఇందులో ఓ మొక్క ధ్వంసమైంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ సంతోష్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా కరీంనగర్‌ కలెక్టర్‌కు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ టీచర్‌ రమేశ్‌, పీఈటీ నాగేశ్వర్‌రావులకు కలిపి రూ.2వేల జరిమానా విధించారు.