సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సమీర్‌ గోయల్‌

వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎండీగా వ్యవహరిస్తున్న సమీర్‌ గోయెల్‌ 2021-22కిగాను సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా ఎంపికయ్యారు. అలాగే అల్‌ప్లా ఇండియా ఎండీ వాగీష్‌ దీక్షిత్‌ సీఐఐ వైస్‌ చైర్మన్‌గా  ఎంపికయ్యారు. జీఎస్‌కేలో కేరియర్‌ను ప్రారంభించి గోయల్‌.. ఆ తర్వాత సిప్లాలో విధులు నిర్వహించారు.