మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్‌

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేపు (సోమ‌వారం) సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్‌ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ సర్క్యూలర్‌ జారీ చేశారు.