తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ ప్రతిష్ఠాత్మకమైన ‘టాప్-20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డును అందుకున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ ఎథినిక్ అడ్వయిజరీ టాస్క్‌ఫోర్స్, మల్టీ ఎథినిక్ కోయలిషన్ సంస్థ తమిళిసైకి ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం చికాగోలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో18 మందికి ఈ అవార్డులను వర్చువల్ విధానం అందజేశారు. ఈ సందర్భంగా యూఎస్ కాంగ్రెస్‌మ్యాన్ డ్యానీ కే డేవిస్‌కు గవర్నర్ తమిళిసై కృతజతలు తెలిపారు.
