మార్చి 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి 15వ తేదీ ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలి 15వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి డా. వి.నర్సింహా చార్యులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.