టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి బుధవారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుబ్రమణ్య స్వామికి సుబ్బారెడ్డి శాలువా కప్పి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికను అందజేశారు. 

టీటీడీ  గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగా  అసత్య ప్రచారం చేస్తున్నారని  సుబ్రహ్మణ్య స్వామి మండిపడిన విషయం తెలిసిందే. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రతిష్టకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఓ వార్తా పత్రికపై  రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు స్వామి తెలిపారు.