స్పీకర్‌ సతీమణి వాణీసీతారాంకి సీఎం జగన్‌ కితాబు

అక్షయపాత్ర పనితీరుపై స్పందించడం బాగుందని, మీరు ‘‘స్టీల్‌ లేడీ ’’అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీమణి వాణీసీతారాంను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. తొగరాం సర్పంచ్‌గా గెలుపొందిన ఆమె స్పీకర్‌తో సీఎంను బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాణమ్మకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జగనన్న గోరుముద్ద పథకానికి సన్నబియ్యం అందించాలని వాణమ్మ కోరగా, వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.