స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75 వారాలపాటు కొనసాగే ఈ ఉత్సవాలను హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభిస్తారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వరంగల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ఈ నేపథ్యంలో పబ్లిక్‌గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. కారు పాసు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు.