తెలంగాణ బ‌డ్జెట్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌స‌ర‌త్తు

తెలంగాణ బ‌డ్జెట్‌పై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు, ఆ శాఖ అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ తుది క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ నెల 18న శాస‌న‌స‌భ‌లో మంత్రి హ‌రీష్ రావు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. నేటి నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు ప‌ది రోజుల పాటు అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.