పుట్టిన రోజు సంద‌ర్భంగా మొక్క‌లు నాటిన ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు

త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పిలుపు మేర‌కు గ్రీన్ ఇండియాలో చాలెంజ్‌లో భాగంగా త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఢిల్లీలోని త‌న నివాసంలో ఎంపీ నామా మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మొక్క‌లు నాటినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ ఈ మ‌హోత్త‌ర కార్య‌క్ర‌మంలో పాల్గొని కోట్లాది మొక్క‌లు నాటాల‌ని నామా నాగేశ్వ‌ర్‌రావు పిలుపునిచ్చారు.