సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) జాయింట్‌ డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌ నియమితులయ్యారు. 1994 గుజరాత్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు డీవోపీటీ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.