తిరుపతి, సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీగా ఈసీ పేర్కొంది. ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలు వెల్లడించున్నట్లు తెలిపింది. కాగా తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్‌ రావు(వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ),  నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్‌) ఆకస్మిక మరణంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఫిబ్రవరి 26న షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం విదితమే.

తిరుపతి, సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌- వివరాలు
►మార్చి 23న నోటిషికేషన్‌
►నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- మార్చి 30
►నామినేషన్ల పరిశీలన-మార్చి 31
►నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3.
►ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్.
►మే 2న ఫలితాలు
.