నకిలీ పాస్‌బుక్కుల కేసులో నిందితుడి అరెస్ట్‌

అసైన్‌మెంట్‌ రివ్యూ కమిటీ (ఏఆర్‌సీ) అఫ్రూవల్‌ లేకుండా ఆన్‌లైన్‌లో పాసుపుస్తకాలను సృష్టించిన ఓ ప్రైవేట్‌ కం ప్యూటర్‌ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బెల్లంపల్లిలో రామగుండం సీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా నెన్నెలలో 2018లో తాసిల్దార్‌ జాడి రాజలింగం ‘డొంగల్‌ కీ’ని కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసిన పూదరి నరేశ్‌గౌడ్‌ దుర్వినియోగం చేసి పలు గ్రామాల్లో ప్రభుత్వ, లావ ణి భూములకు పట్టా చేసినట్టు ఫిర్యాదు అం దింది. విచారణలో 178 మందికి  పాసుబుక్కు లు ఇచ్చినట్టు తేలింది. వీరిలో 88 మంది అనర్హులకు 207.19 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు బహిర్గతమైంది. అప్పటి రెవె న్యూ అధికారుల ఆదేశాలతోనే  88 మందికి పాసుపుస్తకానికి రూ.2 వేలు తీసుకొని ఆన్‌లైన్‌లో పట్టాచేసినట్టు నిందితుడు నరేశ్‌గౌడ్‌ పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులు గతంలో నెన్నెల తాసిల్దార్లుగా పనిచేసిన పీ హరిక్రిష్ణ, జీ వీరన్న, డీ రాజేశ్వర్‌తోపాటు వీఆర్వోలు ఐతె తిరుపతి, రత్నం వెంకటస్వామి, రాజన్న, కరుణాకర్‌, షేక్‌ మహబూబ్‌, మల్లేశ్‌, ఇక్బాల్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ వెల్లడించారు.