తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శాసనసభలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. శాసనసభలో హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం ఒక గంట ఏడు నిమిషాల పాటు కొసాగింది. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం సభను మార్చి 20 ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
