టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌)లో వివిధ పోస్టుల భర్తీకిగాను ఇటీవల నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ మార్కుల జాబితా కోసం tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 2,500 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం), 500 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ (జేఏసీవో), 25 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ (జేపీవో) పోస్టుల భర్తీకి గత సెప్టెంబర్‌లో నోటిఫికేషన్లు వెలువడగా.. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను డిసెంబర్‌లో నిర్వహించారు.