శాసనమండలిలో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పోతుల సునీత, చల్లా భగీరథరెడ్డిలతో చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ప్రమాణం చేయించారు. అనంతరం ఇద్దరికీ అభినందనలు తెలిపి, మండలి నియమ నిబంధనలు వివరించారు. వారికి ధ్రువీకరణ పత్రాలు, బుక్లెట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా, అసెంబ్లీ సహాయ కార్యదర్శి విజయరాజు, తదితరులు పాల్గొన్నారు.
