జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు సీఎం కేసీఆర్ శుభవార్త

 తెలంగాణ రాష్ట్రంలోని జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. సెక్ర‌ట‌రీల ప‌ట్ల మ‌రోసారి సీఎం కేసీఆర్ గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. అంద‌రి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచే రెగ్యుల‌ర్ జీతాలు ఇస్తామ‌న్నారు.

శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. క‌డుపులు నింపినోళ్లం.. క‌డుపు కొట్టినోళ్లం కాదు.. పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని ప‌టిష్టంగా చేయ‌డం వ‌ల్లే గ్రామాలు బాగు చెందుతున్నాయి. హ‌రిత‌హారంలో నాటిన మొక్క‌లు బ‌తుకుతున్నాయి. అంద‌రూ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల మాదిరిగానే.. జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీల‌కు ఈ ఏప్రిల్ నుంచే రెగ్యుల‌ర్ పీఎస్‌ల‌కు ఇచ్చిన జీతాలు ఇస్తాం. కానీ ప్రొబేష‌న‌రీ పీరియ‌డ్‌ను మ‌రో ఏడాది పెంచుతాం.. క‌డుపు నిండా జీతం ఇస్తాం. ఈ విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. త‌మ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డ‌కుండా ప‌ని చేస్తోంద‌న్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.