నారాయణ పేట జిల్లా కలెక్టర్ హరిచందనకు అరుదైన గౌరవం దక్కింది. సోషల్ ఇంపాక్ట్ అవార్డ్ కు హరిచందన ఎంపికైనట్లు బ్రిటిష్ కౌన్సిల్ ప్రకటించింది. లండన్ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ పొలిటికల్ సైన్స్ విద్యార్థిని అయిన హరిచందన పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడం.. ఒక విద్యార్థినిగా భావి విద్యార్థులకు మార్గదర్శకురాలిగా విశేష కృషి చేసినందుకు గానూ ఈ అవార్డుకు ఎంపికైంది. లండన్ స్కూల్ ఆఫ్ కామర్స్ లోని 1500 విద్యార్థులలో నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన ఎంపిక కావడం గమనార్హం.
