నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌

నాగార్జునసాగర్‌‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగ‌త ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ కుమార్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌..భగత్‌కు బీఫామ్‌ అందజేశారు. పార్టీ ప్రచారం కోసం 28లక్షల చెక్‌ను కూడా అందించారు. రేపు ఉదయం భగత్‌‌ తన నామినేషన్‌ వేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని నిలబెట్టింది. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. సాగర్‌ ఉప ఎన్నికలో టికెట్‌ ఆశించిన టీఆర్‌ఎస్‌ నేత కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.