నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్ నుంచి నోముల భగత్‌కుమార్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలు చేసేందుకు నేడు చివరి అవకాశమని అధికారులు తెలిపారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలించనుండగా.. ఏప్రిల్ మూడో తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని అధికారులు పేర్కొన్నారు.
