పరిగి ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి ఎంపీడీవో కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కార్యాలయ సిబ్బంది ఏసీబీకి పట్టుబడింది. ఎంపీడీవో కార్యాలయ అధికారి రఫీ, సాంకేతిక సిబ్బంది లంచం తీసుకుంటూ చిక్కారు. ఎంపీడీవో సుభాష్‌ గౌడ్‌ గుత్తేదారు చక్రవర్తిని లంచం డిమాండ్‌ చేసినట్లుగా ఆరోపణ. లంచం వ్యవహారంలో ఎంపీడీవో సహా 8 మంది సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు సమాచారం.