తెలంగాణలో కొత్తగా 887 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 887 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. వైరస్‌ ప్రభావంతో మరో నలుగురు మృత్యువాతపడ్డారు. 337 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,551 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. 2,166 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 201, మేడ్చల్‌లో 79, నిర్మల్‌లో 78 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,08,776కు చేరింది.