భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్ 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకోనున్నారు. తలైవా దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికవ్వడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
